Sonakshi Sinha: ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. అసలు విషయం ఏంటంటే..

Sonakshi Sinha: బాలీవుడ్‌లో చాలామంది నటీనటులు పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే తాజాగా సోనాక్షి సిన్హా కూడా తనకు ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా ఓ వ్యక్తితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో తనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో కనిపించకుండా జాగ్రత్తపడింది. అయితే అందరూ సోనాక్షి ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది అనుకుంటున్న సమయంలో కూల్‌గా అసలు విషయం బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బిజినెస్‌లో రాణిస్తున్న సినీ సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. అందులో చాలావరకు హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే సోనాక్షి సిన్హా కూడా నెయిల్ కేర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టనుంది. దాని గురించి చెప్పడానికే అప్పుడు అలా పోస్ట్‌లు పెట్టానంటూ తాజాగా సోషల్ మీడియాలో రివీల్ చేసింది సోనాక్షి.
'మిమ్మల్ని ఇప్పటికే ఆటపట్టించింది చాలు. చాలా హింట్స్ ఇచ్చాను కానీ ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నేను నా సొంత బ్రాండ్ సోయిజీని లాంచ్ చేస్తున్నాను. ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టడంతో నా జీవితంలోని అతిపెద్ద కల నిజం కాబోతుంది. నేను ఆ ఫోటోల్లో నా నెయిల్స్‌నే చూపిస్తున్నాను. మీరేం అనుకున్నారు' అని తన బిజినెస్ గురించి పోస్ట్ చేసింది సోనాక్షి. అయితే తనకు ఎంగేజ్‌మెంట్ అన్నట్టుగా అందరినీ మాయ చేసిన సోనాక్షి.. దీంతో తన బిజినెస్‌కు బాగానే పబ్లిసిటీ చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com