Sonakshi Sinha: సోనాక్షి పుట్టినరోజు.. ఐ లవ్యూ అంటూ వీడియో షేర్ చేసిన హీరో..

Sonakshi Sinha: బాలీవుడ్‌లో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కాకుండా పెళ్లయ్యే వరకు వారి రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచడానికే ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఆ రిలేషన్‌షిప్ బయటికి వచ్చినా.. వెంటనే పెళ్లి పీటలెక్కి వారి రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో సీనియర్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఉంది.
సల్మాన్ ఖాన్‌లాంటి స్టార్ హీరోతో 'దబాంగ్' అనే చిత్రంతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది సోనాక్షి. తన స్టోరీ సెలక్షన్‌తో అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. మెల్లగా యంగ్ హీరోయిన్ల తాకిడికి సోనాక్షి కెరీర్ స్లో అయ్యింది. అయినా ఎక్కడా నిరాశపడలేదు. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ ఏడాదికి కనీసం ఒక సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతోలనే తాను ఓ యంగ్ హీరోతో రిలేషన్‌షిప్‌లో ఉందన్న విషయం బయటికొచ్చింది.
బాలీవుడ్‌లో హీరోగా అనుభవం ఉన్నది ఒక్క చిత్రమే అయినా.. సోనాక్షి సిన్హాతో డేటింగ్ చేస్తున్నాడు జహీర్ ఇక్బాల్. సోనాక్షి, జహీర్ పలుమార్లు పార్టీల్లో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. దానికి తగినట్టుగా వీరు కూడా అప్పుడప్పుడు క్లోజ్‌గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా పబ్లిక్‌గా ఐ లవ్యూ చెప్పుకుంటూ వీరి రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేసేశారు సోనాక్షి, జహీర్.
సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా జహీర్ ఓ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ.' అంటూ క్యాప్షన్‌తో ఓ వీడియో పోస్ట్ చేశాడు జహీర్. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కామెంట్లు పెట్టారు. సోనాక్షి సైతం కామెంట్స్‌లో 'ఐ లవ్యూ. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తాను' అని రిప్లై ఇచ్చింది. ఇక ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలలాగానే వీరు కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com