Sonam Kapoor: మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్.. క్యూట్ పోస్ట్ షేర్..
Sonam Kapoor: ఒకప్పటిలాగా పెళ్లి, ప్రెగ్నెన్సీ్ అనేవి హీరోయిన్ల కెరీర్‌కు అడ్డుగా భావించడం లేదు. అందుకే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కూడా వారు ప్రేమించిన వారితో ఏడడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు. అలాగే హీరోయిన్‌గా పర్వాలేదు అనిపించుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్.. బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
2018 మే 8న ఆనంద్‌తో సోనమ్ పెళ్లి జరిగింది. మార్చి 2022లో సోనమ్ ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసింది. అప్పటినుండి తను సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటుంది. అంతే కాకుండా బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు తన బేబీ బంప్‌తో సోనమ్ విడుదల చేసిన ఫోటోలు మాత్రం నెట్టింట్లో హల్‌చల్ చేశాయి. ఇక నేడు సోనమ్.. మగబిడ్డకు జన్మనిచ్చినట్టు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.
'2022 ఆగస్ట్ 20న చేతులు చాచి మనస్ఫూర్తిగా మా బేబి బాయ్‌కు వెల్‌కమ్ చెప్పాము. ఈ ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసిన డాక్టర్లు, నర్సులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ థాంక్యూ. ఇది కేవలం ప్రారంభమే కానీ మా జీవితాలు ఇప్పటినుండి పూర్తిగా మారిపోతాయని పూర్తిగా అర్థమయ్యింది' అని సోనమ్, ఆనంద్ రాసిన నోట్‌ను పలువురు బాలీవుడ్ ప్రముఖులు షేర్ చేయగా ఈ విషయం బయటికొచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com