Sonu Sood: గుట్కా తింటే పోతావ్...

రియల్ స్టార్ సోనూ సూద్ మరోసారి తన మంచి మనసు చాటుకునే ప్రయత్నం చేశాడు. ఓ అభిమానితో గుట్కా అలవాటు మాన్పించే ప్రయత్నం చేసిన సోనుపై నెటిజెన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవలే నడుస్తున్న రైలులో ఫుట్ బోర్డింగ్ చేసి రైల్వేశాఖ ఆగ్రహానికి గురైన సోనూ సూద్, ఈసారి గుట్కా కంపెనీలకు పెద్ద ఝలక్కే ఇచ్చేశాడు. సరదాగా ఓ టీ కొట్టుకు వెళ్లిన సోనూ, తనకోసం టీ తయారు చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లాడు. అతడు గుట్కా నములుతుండటంతో తనలోని వారియర్ ను బయటకు తీసుకువచ్చేశాడు.
గుట్కా తింటున్నావా అని చాయ్ వాలాను అడగగా, అతడు అవునని చెప్పడంతో ముందు వెళ్లి త్వరగా దాన్ని ఊసేయ్ అని సోనూ తెలిపాడు. హీరో సూచన మేరకు గట్కా ఉమ్మివేసి, చక్కగా నోరు కడుగుకుని వచ్చిన చాయ్ వాలాతో కాసేపు ముచ్చటించిన సోనూ గుట్కా వల్ల కలిగే దుష్ప్రభావల గురించి అతడికి వివరించాడు. అంతేకాదు పక్కనే ఉన్న పాన్ డబ్బా యజమాని దగ్గరకు తీసుకెళ్లి ఇంకెంప్పుడూ ఈ వ్యక్తికి గుట్కా ఇవ్వద్దని, ఇతడిపై ఆధారపడి ఓ కుటుంబం మొత్తం బతుకుతోందని తెలిపారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. సోనూపై మరోసారి ప్రసంశల వర్షం కురుస్తోంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్స్ గుట్కాను ప్రమోట్ చేస్తుండగా, సోనూ మాత్రమే ఒక స్టాండ్ తీసుకున్నాడని కొందరు మనోడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com