Sridevi Biography: అతిలోక సుందరి అంతరంగం...

Sridevi Biography: అతిలోక సుందరి అంతరంగం...
X
అతిలోక సుందరి ఆత్మకథ; త్వరలోనే పుస్తక రూపంలో...

అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా అద్భుతమైన సినిమాల రూపంలో ఓ అందమైన మధుర జ్ఞాపకంగా అందరి మదిలోనూ నిలిచిపోయింది. అయితే నటిగా తెరపై ఎన్ని హావభావాలు పలికించినా ఆమె మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎవరితరమూ కాలేదు. సినీ లోకంలోనే పెరిగి పెద్దైన శ్రీదేవి అంతరంగం ఇప్పటికీ ఓ జవాబు దొరకని ప్రశ్నే. అయితే ఈ చిక్కుముడులకు ఆమె ఆత్మకథ సమాధానం చెప్పబోతోందా? అంటే అవుననే చెప్పాలి. ఇటీవలే శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆమె ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ పుస్తకానికి 'శ్రీదేవి- ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. వెస్ట్ ల్యాండ్ బుక్స్ సంస్థ ఆత్మకథ పబ్లిషింగ్ రైట్స్ దక్కించుకోగా, ధీరజ్ కుమార్ ఈ పుస్తకారనికి రచయితగా వ్యవహరించనున్నారు. ఈయన శ్రీదేవికి అత్యంత ఆప్తుడని తెలుస్తోంది. ఈ పుస్తకంల ో శ్రీదేవి జీవితానికి సంబంధించి 360డిగ్రీల కోణంల ో ప్రతి ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా శ్రీదేవి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం అంటూ బోనీ కపూర్ కొనియాడారు. తెరపై తననితాను చూసుకుంటున్నప్పుడు శ్రీదేవి అమితానందాన్ని పొందేవారని వెల్లడించారు.


Tags

Next Story