Sushant Singh Rajput: ఆ పాపం నన్ను చంపేస్తోంది...

Sushant Singh Rajput: ఆ పాపం నన్ను చంపేస్తోంది...
X
ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది; సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో అనురాగ్ సంచలన విషయాలు...

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆత్మహత్యకు కొన్ని రోజుల క్రితమే శుశాంత్ తనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడని, కానీ తాను కావాలనే అతడిని దూరం పెట్టానని, అందుకు ఇప్పుడు బాధపడుతున్నానని వెల్లడించాడు. ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంతకాలంగా తన మనసుని కలవరపెడుతున్న విషయాన్ని బహిర్గతం చేశాడు. గతంలో సుశాంత్ తో తనకు మనస్ఫర్ధలు తలెత్తిన వైనాన్ని చెప్పుకొచ్చాడు. భారీ సినిమాలు అందిపుచ్చుకుంటోన్న సమయంలో సుశాంత్ తనను ఇగ్నోర్ చేశాడని, తన సినిమాలో లీడ్ రోల్ ను తిరస్కరించాడని అనురాజ్ తెలిపాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే సుశాంత్ తన మేనేజర్ ద్వారా తనతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా స్పందించలేదని చెప్పాడు. అప్పుడు తనను పట్టించుకోలేదు కాబట్టి, ఇప్పుడు తనకు మాట్లాడాల్సిన అవసరంలేదని చెప్పానని స్పష్టం చేశాడు. అయితే కొంతకాలానికే సుశాంత్ సుసైడ్ చేసుకోవడం తనను విపరీతంగా బాధపెట్టిందని అనురాగ్ తెలిపాడు. ఒకవేళ తాను ఆరోజే సుశాంత్ తో మాట్లాడి ఉంటే అతడు బతికి ఉండేవాడేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు. తప్పు తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయిందని వాపోయాడు. ఈ నేపథ్యంలోనే నటుడు అభయ్ డియోల్ కు తాను సారీ చెప్పినట్లు తెలిపాడు. అభయ్ తోనూ తనకు ఇదేవిధంగా గొడవలు అయ్యాయని, కానీ, సుశాంత్ కు జరిగినట్లు మరెవరి విషయంలోనూ పొరపాటు చేయకూడదన్న ఉద్దేశంతోనే అతడికి ఫోన్ చేసి సారీ చెప్పినట్లు వెల్లడించాడు.


Tags

Next Story