సుశాంత్ ప్రాణాలతో తిరిగొచ్చినట్లు ఉంది : శ్వేతా సింగ్

సుశాంత్ ప్రాణాలతో తిరిగొచ్చినట్లు ఉంది : శ్వేతా సింగ్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మైనపు విగ్రహాన్ని ఆయన సోదరి శ్వేతా సింగ్ ఇటీవలే ఆవిష్కరించారు. ఆ విగ్రహం తయారీకి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. మైనపు విగ్రహాన్ని చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరుడు ప్రాణాలతో తిరిగొచ్చినట్లు ఉందంటూ ఆమె పోస్ట్ చేశారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన పశ్చిమబెంగాల్‌కు చెందిన కళాకారుడు సుశాంత్ రాయ్‌కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కళాకారుడు దాదాపు నెలన్నర కష్టపడి సుశాంత్ వ్యాక్స్ స్ట్యాచ్చూను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక సుశాంత్ మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టనున్నట్లు శ్వేతాసింగ్ తెలిపారు.Tags

Read MoreRead Less
Next Story