Sushmita Sen: 'ఈ మాత్రం క్లారిటీ చాలా?'.. సోషల్ మీడియాలో సుస్మితా సేన్ పోస్ట్..

Sushmita Sen: ఈ మాత్రం క్లారిటీ చాలా?.. సోషల్ మీడియాలో సుస్మితా సేన్ పోస్ట్..
Sushmita Sen: సుస్మితా సేన్ స్పందన ఏంటో చూడాలని ఎదురుచూసిన నెటిజన్లకు ఫైనల్‌గా రిప్లై దొరికింది.

Sushmita Sen: బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసి.. తప్పించుకు తిరుగుతున్న లలిత్ మోదీతో మాజీతో మాజీ విశ్వ సుంద‌రి, న‌టి సుస్మితా సేన్ డేటింగ్‌లో ఉన్నారు. ఈ మేరకు వారు కలిసి దిగిన ఫోటోలను లలిత్ మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాము త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు. ఒక్కసారిగా తన సోషల్ మీడియా పోస్టులు సంచలనాన్ని సృష్టించగా.. సుస్మితా సేన్ వాటిపై ఇప్పటికి రియాక్ట్ అయ్యింది.

సుస్మితా కొన్నాళ్ల పాటు మోడల్, యాక్టర్ రోహ్మన్ శాల్‌తో రిలేషన్‌లో ఉంది. వారిద్దరి మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉందని ప్రేక్షకులు విమర్శించినా పట్టించుకోకుండా ప్రేమలో మునిగి తేలారు. కానీ ఏమైందో తెలియదు గత డిసెంబర్‌లో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు లలిత్ మోడీతో సుస్మితా డేటింగ్ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సుస్మితా సేన్ స్పందన ఏంటో చూడాలని ఎదురుచూసిన నెటిజన్లకు ఫైనల్‌గా రిప్లై దొరికింది. 'నేను ఒక హ్యాపీ ప్లేస్‌లో ఉన్నాను. పెళ్లి లేదు, రింగ్స్ లేవు. అమితమైన ప్రేమ మధ్యలో ఉన్నాను. ఈ మాత్రం క్లారిటీ చాలేమో. ఇప్పుడు వర్క్‌కు తిరిగి వెళ్లాలి. నా సంతోషంలో ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ. ఇక తోడుగా ఉండనివారు మీ పని మీరు చూసుకోండి.' అంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది సుస్మితా.


Tags

Read MoreRead Less
Next Story