Swara Bhaskar: ఒకింటిదైన స్వరా భాస్కర్...
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్వరా భాస్కర్ చెప్పాపెట్టకుండా పెళ్లాడేసింది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లోని వ్యక్తిగా బండి లాగించేస్తోంది స్వర. సామాజిక అంశాలపై మాట్లాడుతూ అందరి దృష్టీ తన వైపు తిప్పుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంటుంది. ముఖ్యంగా పౌరసత్వ(సవరణ)చట్టానికి వ్యతిరేకంగా ఎన్నో నిరసనల్లోనూ పాలుపంచుకుంది. ఇక కొంతకాలంగా పూర్తిగా సైలెంట ్అయిపోయిన స్వరా భాస్కర్ సడన్ పెళ్లి వార్తను మొసుకొచ్చే సరికి అందరూ ఆశ్చర్యపోయారు. రాయకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదుగుతున్న ఫాహద్ అహ్మద్ అనే యువకుడిని రిజిస్టర్ వివాహం చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడంట్ గా వ్యవహరిస్తున్న ఫాహద్ ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద్ కోర్ట్ లోనే మనువాడింది. ఇక ట్విట్టర్ ద్వారా తమ పెళ్లి గురించి జనాలకు తెలిపిన స్వరా.. కొన్ని సార్లు మనకు కావాల్సిందాన్ని పక్కనే పెట్టుకుని ఊరంతా వెతుక్కుంటామని, అదే విధంగా తాము కూడా ప్రేమ కోసం వెతుక్కుంటోంటే స్నేహం ఎదురైందని ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం స్వరా ఫవాద్ గురించి ట్విట్టర్ లో ఓ కామెంట్ పెట్టింది. పెళ్లెప్పుడు చేసుకుంటా అన్నాయ్ అంటూ ఆమె పెట్టి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అన్నా అంటూనే అతడిని ఎలా పెళ్లి చేసుకున్నావంటూ నెటిజెన్లు స్వరాభాస్కర్ ను ఏకిపారేస్తున్నారు. మరి దీనిపై అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com