Taapsee Pannu : స్టార్స్ ఆ సాహసం చేయరు... తాప్సి కీలక వ్యాఖ్యలు

Taapsee Pannu : మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితరకి పరిచయమైంది నటి తాప్సి.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చి అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆమె నటించిన స్పోర్ట్స్ డ్రామా 'రష్మీ రాకేట్' చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ను అందుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన తాప్సి స్టార్ హీరోల పైన కామెంట్స్ చేసింది. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో వారు ఇష్టపడరంటూ అభిప్రాయపడింది.
"ఓ సినిమాలో నాది డబుల్ రోల్... అదే సినిమాలో హీరో పాత్ర కోసం ఓ నటుడిని అనుకున్నారు నిర్మాతలు.. అతన్ని సంప్రదించారు కూడా.. కానీ అతను ఒప్పుకోలేదు. ఆ హీరో గతంలో నాతో ఓ సినిమా కూడా చేశాడు. ఆయన ఓ పెద్ద స్టార్ అయినప్పటికీ నాతో నటించడానికి అభద్రత భావంగా ఫీల్ అయ్యారు. ఇది నిజంగా బాధాకరం. ఓ చిన్న హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే ఉద్దేశంతో వారు ఆ పాత్రకు ఒప్పుకోలేదు" అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com