Taapsee Vs Kangana: ఆమెతో నాకేం పేచీ లేదు సుమీ...

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తో పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. దీంతో ఆమె విషయానికి వచ్చేసరికి ఎవరైనా కాస్త జాగ్రత్తగానే మాట్లాడటం అలవాటు చేసుకుంటున్నారు. తాజాగా మోస్ట్ డిపెండబుల్ యాక్టర్ గా పేరుగాంచిన తాప్సీ కంగనతో తనకు ఏర్పడ్డ విభేధాలపై స్పందించింది. అయితే అమ్మడు ఆచితూచి మాట్లాడటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఎప్పుడైనా కంగన ఎదురుపడితే ఆమెతో మాట్లాడతారా అని అడగ్గా, నాకు ఆమెతో అసలు సమస్యే లేదు. ఆమెకే నాతో ఏదో ఇబ్బంది ఉన్నట్లు ఉంది. అయితే ఇప్పటికీ నేను ఆమెకు అభిమానినే అంటూ తాప్సీ వ్యాఖ్యానించింది. గతంలో కంగన ముక్కుసూటి వైఖరిపై తాప్సీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు డబుల్ ఫిల్టర్ కావాలని తాప్సీ కామెంట్ చేసింది. దీనిపై కంగన సోదరి రంగోలి తాప్సీపై వరుస ట్వీట్లతో విరుచుకుపడింది. తాప్సీ కంగనకు చవకైన కాపీ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే దాన్ని తాను ప్రసంశగానే తీసుకుంటాను అంటూ తాప్సీ హుందాగా వ్యవహరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com