Tabu: షూటింగ్‌లో ప్రమాదం.. టబు కంటిపై గాయం..

By - Divya Reddy |11 Aug 2022 8:17 AM GMT
Tabu: సీనియర్ నటి టబు ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయాలపాలైంది.
Tabu: సీనియర్ నటి టబు ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయాలపాలైంది. ఆమె ప్రస్తుతం అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'భోలా' చిత్రంలో నటిస్తోంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా.. ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో నుదటిపైనా, కంటికి దగ్గర గాయాలయ్యాయి. గాయపడిన టబును వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఐతే కంటికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com