Lust Stories 2: అందాల గుమ్మలు... ఎగబిడిన జనాలు

లస్ట్ స్టోరీ రెండవ భాగం రిలీజ్ కు సిద్ధమవుతుండటంతో అందులో కీలక పాత్రలు పోషించిన తమన్నా, మృణాల్ ఠాకుర్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోనూ ఈ ముద్దుగుమ్మలు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హడావిడి చేశారు. వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ముద్దుగుమ్మలిద్దూ మళ్లీ ముంబై ఫ్లైట్ ఎక్కేశారు. సాధారణంగా ఒక్కక్కరిగానే ఫ్లైట్ దిగితేనే ఈ ముద్దుగుమ్మలు మైమరిపిస్తుంటారు. ఇక ఒక్కసారే ఇద్దరు అప్సరసలు ఫ్లైట్ దిగడంతో అభిమానులను ఆపడం ఎవరితరం కాలేదు.
తమన్నా, మృణాల్ ను ఒక్క ఫ్రేమ్ లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు హడావిడి పడుతుండగానే, అభిమానులు ముద్దుగుమ్మలపై అమాంతం విరుచుకు పడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అంతమంది ఒక్కసారిగా దూసుకువచ్చినా ఇద్దరూ ఓర్పుగానే వారికి సెల్పీలు ఇచ్చారు. ఇక తమన్నా కోసమే ఎదురుచూస్తున్న ఓ వీరాభిమాని ఆమె ముఖారవిందాన్ని పచ్చబొట్టుగా వేయించుకుని దర్శనమిచ్చాడు. తమన్నా కనిపించగానే ఆమె కాళ్లమీద పడి వేడుకున్నాడు. అభిమాని చూపించిన ప్రేమకు ఉబ్బితబ్బిబైపోయిన తమన్నా అతడిని వారించి గట్టిగా హత్తుకుంది. ఏమైనా ముద్దుగుమ్మలు ఈ విధంగా దర్శనమివ్వడం ఇటు ఫ్యాన్స్ లోనూ, అటు ఫొటోగ్రాఫర్లలోనూ ఎక్కడలేని ఉత్సాహాన్ని నిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com