Lust Stories: ఫ్యామిలీతో కలసి ఆ సీన్లు చూడలేకపోయాను

సిల్వర్ స్క్రీన్ పై లేలేత అందాలతో కనువిందు చేసే మిల్కీ బ్యూటీ తమన్నా, ఇప్పటివరకూ ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసింది కానీ, ఒక్కసారిగా కూడా బోల్డ్ సీన్స్ లో కనిపించలేదు. ఆమె ఇప్పటివరకూ పెట్టుకున్న నో కిస్సింగ్ రూల్ వల్ల తెర మీద ఎప్పడూ హద్దు మీరలేదు. అయితే కెరీర్ ను ఇప్పటివరకూ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న మిల్కీ బ్యూటీ ఇకపై అలా మడిగట్టుకుని కూర్చుంటే కుదరదని ఫిక్స్ అయ్యి లస్ట్ స్టోరీస్ 2 పుణ్యమాని తన నిబంధనకు తిలోదకాలు ఇచ్చేసింది. అయితే, ఈ కొత్త మార్పు అమ్మడికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉందట.
ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 విడుదలై ఓ మోస్తరుగా ఉందని పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమ్మడు ఇంతగా కష్టపడి, రూల్స్ పక్కన పెట్టి మరీ చేసిన బోల్డ్ సీన్స్ బొత్తిగా తేలిపోయాయి. ఇహ ఎప్పటిలాగానే సినిమా విడుదలయ్యాక కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి చూసే అలవాటు ఉన్న తమన్నాకు ఈసారి మహా ఇబ్బంది పడిపోయిందట. తల్లిదండ్రులతో కలసి తన బోల్డ్ సీన్స్ చూసుకోవడం చాలా ఇబ్బందిగా మారిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే, ప్రేక్షకులు ఆశించినది తెరపై చేసినందుకు సంతోషిస్తున్నాను అని చెప్పింది మన మిల్కీ బ్యూటీ.
ఇక ఈ ముచ్చట అంతా పక్కన పెడితే మిల్కీ బ్యూటీ తమన్నాకు తన సహ నటుడు విజయ్ వర్మతో ఆఫ్ స్క్రీన్ లో మంచి కెమిస్ట్రీనే కుదిరింది. వీరిద్దరూ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న విషయమూ తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com