Tamannaah: బౌన్సర్ పాత్రలో తమన్నా.. ఓటీటీలో సినిమా..

Tamannaah: హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి యాడ్ అయ్యింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయని బౌన్సర్ పాత్రలో ప్రయోగం చేయడానికి తమన్నా రెడీ అయ్యింది.
ఎంత స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నా కూడా ప్రస్తుతం తమన్నాకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఇటీవల 'ఎఫ్ 3' ద్వారా క్లీన్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నా కూడా ఈ సినిమా తనకు మరేమీ అవకాశాలు తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం తమన్నా చేతిలో 'భోళా శంకర్' ఒక్కటే తెలుగు చిత్రం ఉంది. మిగతావన్నీ హిందీ సినిమాలే. అందులో ఒకటి త్వరలో ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది.
మధుర్ బండార్కర్ దర్శకత్వంలో బౌన్సర్ పాత్రలో తమన్నా నటిస్తున్న చిత్రమే 'బబ్లీ బౌన్సర్'. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోంది. సెప్టెంబర్ 23న బబ్లీ బౌన్సర్ నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇక తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది తమన్నా. ఈ సినిమాలో తమన్నాతో పాటు సౌరబ్ షుక్లా, అభిషేక్ బజాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com