Tapsee Pannu: ఆరుపలకలు పట్టేసింది...

X
By - Chitralekha |7 April 2023 11:51 AM IST
తాప్సీ సిక్స్ ప్యాక్స్ ఆబ్స్ ; నివ్వెరపోతున్న నెటిజెన్లు
తెలుగునాట క్యూట్ అండ్ స్వీట్ గా కనిపిస్తూ అలరించిన అందాల నటి తాప్సీ పన్ను బాలీవుడ్ కు వెళ్లాక పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. క్రమంగా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్ కూ మారుతున్న తాప్సీ ఈ మధ్య జిమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతోన్న సంగతి తెలిసిందే. ఆమె ఇన్స్టా పేజ్ ను ఫాలో అవుతున్న వారికి ఆ విషయం ఇట్టే అర్థమైపోతోంది. ఏదైనా పాత్ర కోసం అమ్మడు కసరత్తులు ఇరగదీస్తోంది అనుకుంటే, తాజా పోస్ట్ తో అందరి ఫ్యూజులు ఎగరగొట్టేసింది. ఏకంగా సిక్స్ ప్యాక్స్ ఆబ్స్ తో దర్శనమిచ్చి వారెవా అనిపించుకుంది. కొంతకాలంగా జిమ్ములో పడిన కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోతూ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అమ్మాయిలు సైతం ఆరుపలకల దేహంలో హాట్ గా కనిపిస్తారని నిరూపించిన తాప్సీ ఇంకెంతమందికి స్ఫూర్తినిస్తుందో చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com