Tara Sutaria: 'ఇండస్ట్రీలో హీరోలకే ఎక్కువ గౌరవం దక్కుతుంది': యంగ్ బ్యూటీ

Tara Sutaria: ఇండస్ట్రీలో హీరోలకే ఎక్కువ గౌరవం దక్కుతుంది: యంగ్ బ్యూటీ
Tara Sutaria: సినీ పరిశ్రమలో చూపించే తేడా గురించి ఓ యంగ్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Tara Sutaria: ఈ జెనరేషన్ మగ, ఆడ అని తేడా లేదు. అందరూ సమానమే. అందరూ సమానంగా విజయాలు సాధిస్తున్నారు. ఎవరూ తక్కువ కాదు. ఇలాంటివి ప్రతీరోజూ వింటూనే ఉంటాం. కానీ కొన్ని రంగాల్లో మాత్రం ఇంకా ఆడవారు వెనకబడే ఉన్నారన్నది అందరికీ తెలిసిన నిజమే. ఇక సినీ పరిశ్రమలో కూడా అలాంటివి ఉంటాయని తాజాగా ఓ యంగ్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

హీరోలను బాబు, సార్ అని పిలిచే మేకర్స్.. హీరోయిన్స్‌ను మాత్రం వారి సినిమాల సంఖ్యను బట్టి, అందులో వాటి హిట్స్‌నుు బట్టి పేరు పెట్టి పిలవాలా, మేడమ్ అని పిలవాలా అని డిసైడ్ అవుతారు. ఇది చాలావరకు ఇండస్ట్రీ గురించి చాలామందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇక రెమ్యునరేషన్ విషయంలో హీరో, హీరోయిన్ల మధ్య తేడాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా *ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌' ఫేమ్ తారా సుతారియా ఇదే విషయం గురించి స్పందించారు.


'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌' మూవీ జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే మూవీ టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా గడిపేస్తోంది. అప్పుడే తారా కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇండస్ట్రీలో హీరోకు, హీరోయిన్‌కు ఇచ్చే గౌరవంలో తేడా ఉంటుంది అని చెప్పుకొచ్చింది తారా సుతారియా. హీరోలను సార్ అంటుంటారని, హీరోయిన్లను మాత్రం పేరు పెట్టి పిలుస్తారని తెలిపింది. ఫోటోగ్రాఫర్లు తమను కూడా మేడమ్ అని పిలవాలని తను చెప్పట్లేదని.. దీన్ని బట్టి చూస్తే మాత్రం అబ్బాయిలకే ఎక్కువ గౌరవం దక్కుతుందని అర్థమవుతుందని వాపోయింది.



Tags

Next Story