Tunisha Sharma Suicide: పోలీసుల అదుపులో తునిషా ప్రియుడు; పొంతలేని సమాధానాలతో విసిగిస్తున్న షీజాన్
Mumbai

Tunisha Sharma Suicide: పోలీసుల అదుపులో తునిషా ప్రియుడు; పొంతలేని సమాధానాలతో విసిగిస్తున్న షీజాన్
హిందీ సీరియల్ నటి తునిషా శర్మ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. షూటింగ్ సెట్స్ లోనే ఆత్మహత్యకు పాల్పడిన తునిషా బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ వల్లే ప్రాణాలు తీసుకుందని స్ఫష్టం అవుతోంది. ఈ మేరకు ఆమె ప్రియుడు, సహ నటుడు అయిన షీజాన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే షీజన్ ఖాన్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.
20ఏళ్ల తునిషాతో బ్రేక్ అప్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్న అంశంపై విచారించగా, ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్యతో భయపడి ఆమెతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు, ఇరువురి మతం ఒక్కటి కాకపోవడం కూడా ఓ కారణమని వెల్లడించాడు.
అయితే షీజన్ ఖాన్ సమాధానాలతో సంతృప్తి చెందని పోలీసులు అతడి కస్టడీని డిసెంబర్ 28 వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు షీజాన్, తునిషాను చీట్ చేయడం వల్లే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. అతడికి తగిన శిక్ష విధించాలంటూ కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com