బ్లాక్ వాటర్.. లీటర్ రూ.4 వేలు.. సెలబ్రెటీల ఛాయిస్

బ్లాక్ వాటర్.. లీటర్ రూ.4 వేలు.. సెలబ్రెటీల ఛాయిస్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఢిల్లీ నుండి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కింది. ఇప్పటికే ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌తో అభిమానులకు చేరువైంది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఢిల్లీ నుండి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కింది. ఇప్పటికే ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌తో అభిమానులకు చేరువైంది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌లో నల్లటి ద్రవం కనిపించింది. విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఊర్వశి తన బ్లేజర్‌లో అద్భుతంగా కనిపించింది. ఊర్వశి చేతిలోని బాటిల్‌లో 'బ్లాక్ వాటర్' ఉంది, దీని ధర లీటరుకు దాదాపు 3000-4000 రూపాయలు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరి కొందరు ప్రముఖులు కూడా ఈ ప్రత్యేక నీటిని తాగుతుంటారు. ఊర్వశి మోస్తున్న నీటి బాటిల్‌లో ఆల్కలీన్ నీరు ఉంటుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచటానికి సహాయపడుతుంది. 'బ్లాక్ వాటర్'లో పీహెచ్ అధికంగా ఉంటుంది.

కోహ్లీతో పాటు మరి కొందరు ప్రముఖులు వారి రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండటానికి కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు లాక్డౌన్ సమయంలో 'బ్లాక్ వాటర్'కు మారామని చెబుతున్నారు.

Tags

Next Story