Urvashi Rautela: నటి మెడపై గాటు.. అందుకేనంటూ రూమర్స్..

Urvashi Rautela (tv5news.in)
Urvashi Rautela: మామూలుగానే సినీ పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువ. అందుకే ఏ హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా.. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ రూమర్స్ మొదలయిపోతాయి. అంతే కాకుండా ఈమధ్య నటీనటుల ప్రవర్తనలో మార్పు వచ్చినా కూడా.. నెటిజన్లు అనుమానించడం మొదలుపెట్టేశారు. అలాగే తాజాగా ఓ బాలీవుడ్ నటిపై కూడా విమర్శలు రాగా.. దానికి ఆమె ఘాటుగానే స్పందించింది.
మామూలుగా సినీ సెలబ్రిటీలు.. ప్రేక్షకులకు ఎక్కువగా కనిపించేది ఎయిర్‌పోర్ట్స్‌లోనే. అందుకే అక్కడ వారిపై ప్రతీ కెమెరా కన్ను ఉంటుంది. అలాంటి సమయంలోనే వారు చూపించే చిన్న హావభావాలు కూడా కెమెరా కంటికి చిక్కుతాయి. అలా ఇటీవల బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎయిర్‌పోర్టులో కనిపించడంతో కెమెరాలు అన్నీ ఆమెవైపు తిరిగాయి.
ఎయిర్‌పోర్టులో కెమెరాకు చిక్కిన ఊర్వశి మెడపై చిన్న గాటు కనిపించింది. అయితే అది లవ్ బైట్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా జాతీయ మీడియాలో దీని గురించి ప్రచారం కూడా జరిగింది. అయితే తన గురించి రాసిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ ఊర్వశి ఫైర్ అయ్యింది.
'అది నా రెడ్ లిప్‌స్టిక్. నా మాస్క్ వల్ల నా మెడకు అంటుకుంది. ఏ అమ్మాయినైనా అడగండి రెడ్ లిప్స్ మెయింటేయిన్ చేయడం ఎంత కష్టమో చెప్తుంది. ఎవరి ఇమేజ్‌ను అయినా, ముఖ్యంగా అమ్మాయిల ఇమేజ్‌ను చెడగొట్టడానికి వారు ఇలాంటి వార్తలు రాస్తారంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా' అంటూ తనను క్షమాపణలు కోరాలి అని చెప్పింది ఊర్వశి.
Ridiculous!!!!! Its my red lipstick which spread from my mask. Its hard to maintain red lips ask any girl. Cant believe they can write anything to harm anyone's image specially girls. Why dont you guys write about my achievements than spreading fake news for your own benefits. pic.twitter.com/o7mbrANMqP
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 20, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com