Vidyut Jamwal: లండన్‌లో సీక్రెట్‌గా బాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి..

Vidyut Jamwal: బాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా లవ్ మ్యారేజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. కోవిడ్ లాక్‌డౌన్ సమయం నుండి ఎంతోమంది నటీనటులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. అంతే కాకుండా అందులో కొందరు తమ వారసులను కూడా ఆహ్వానింబోతున్నారు. తాజాగా లవ్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ కపుల్స్ లిస్ట్‌లో మరో జంట పేరు యాడ్ అవ్వనుంది.
బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా పాపులర్ అయ్యాడు విద్యుత్ జమ్వాల్. ఫిట్‌నెస్ విషయంలో ఇప్పటికీ ఇతర యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు ఈ హీరో. వెంటవెంటనే సినిమాలు చేయకపోయినా.. తన యాక్షన్ సినిమాలకు కూడా బాలీవుడ్‌లో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక త్వరలోనే ఈ నటుడు ఓ ఇంటివాడవ్వబోతున్నాడన్న వార్త బాలీవుడ్‌లో వైరల్ అయ్యింది.
విద్యుత్ జమ్వాల్.. నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ వీరి ప్రేమ విషయాన్ని గతేడాది ఎంగేజ్‌మెంట్ రోజున అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా విద్యుత్, నందితా.. లండన్ టూర్‌కు వెళ్లారు. అయితే అక్కడే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా వారిద్దరి పెళ్లి ఇప్పటికే అయిపోయిందని.. కానీ ఈ విషయం బయటికి రానివ్వడం లేదని కొందరు అంటున్నారు. రానున్న 15 రోజుల్లో విద్యుత్ స్వయంగా తమ పెళ్లి విషయం గురించి అధికారికంగా ప్రకటించనున్నాడని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com