Vijay Devarakonda: విజయ్‌తో డేట్ చేయాలనుందన్న సారా.. హీరో క్యూట్ రిప్లై..

Vijay Devarakonda: రోజురోజుకీ బాలీవుడ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా అక్కడి యంగ్ హీరోయిన్లు విజయ్‌పై మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లు విజయ్‌తో డేటింగ్ చేయాలని ఉంది అని ఓపెన్‌గా వెల్లడించగా.. ఇటీవల సారా అలీ ఖాన్ కూడా విజయ్ అంటే ఇష్టమన్న విషయాన్ని బయటపెట్టింది. ఇక దీనికి విజయ్ స్పందించాడు కూడా.
ఇటీవల కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ కలిసి పాల్గొన్నారు. ఇప్పటికే కాఫీ కరణ్ మొదటి ఎపిసోడ్‌లో రణవీర్ సింగ్, ఆలియా భట్ వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు సారా అలీ ఖాన్, జాన్వీ వంతు. ఇటీవల రెండో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అవ్వగా అందులో విజయ్ దేవరకొండను డేట్ చేయాలనుందంటూ సారా స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీనికి విజయ్ రిప్లై ఇచ్చాడు.
విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లోని దాదాపు అందరు యంగ్ హీరోయిన్స్‌తో సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా ఇప్పటికీ వారి పార్టీలకు ఎన్నోసార్లు వెళ్లాడు కూడా. అందుకే సారా అలీ ఖాన్‌కు తనతో డేట్ చేయాలనుంది అని తెలియగానే విజయ్ వెంటనే రెస్పాన్డ్ అయ్యాడు. 'నువ్వు దేవరకొండ అని అనే విధానం నాకు చాలా నచ్చింది. క్యూట్‌గా ఉంది' అంటూ జాన్వీ కపూర్‌ను, సారాను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ట్యాగ్ చేశాడు విజయ్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com