Vijay Sethupathi: 'జవాన్'లో విలన్‌గా సేతుపతి.. దిమ్మదిరిగే రెమ్యునరేషన్ డిమాండ్..

Vijay Sethupathi: అట్లీ, షారుఖ్ ఖాన్ మూవీ ఫైనల్ అయ్యిందని సమాచారం తప్పా ఈ సినిమా నుండి చాలాకాలం వరకు ఏ అప్డేట్ లేదు. ఇక ఈ మూవీకి 'జవాన్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించడం హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. అంతే కాకుండా జవాన్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించడం సినిమాకు మరో పెద్ద ప్లస్. అయితే ఈ మూవీలో నటించడం కోసం సేతుపతికి భారీగానే రెమ్యునేషన్ అందుతున్నట్టు సమాచారం.
తాజాగా జవాన్ మూవీలో షారుక్‌తో తలపడేందుకు విజయ్ సేతుపతిని విలన్‌గా ఒప్పించాడట అట్లీ. ఇప్పటికే విక్రమ్ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించి ఫుల్ మార్కులు కొట్టేసిన సేతుపతి.. షారుక్‌తో కలిసి త్వరలోనే సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడట. అయితే విజయ్ సేతుపతి ప్రస్తుతం పలు భాషా చిత్రాల్లో నటిస్తుండగా తన కాల్ షీట్స్‌ను సంపాదించడం కోసం నిర్మాతలు ఏ మాత్రం తగ్గని రెమ్యునరేషన్‌ను తనకు ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే విజయ్ సేతుపతి.. కత్రినా కైఫ్‌తో హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటు జవాన్‌లో విలన్‌గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. విక్రమ్ సినిమాలో విలన్ రోల్ కోసం రూ.15 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న సేతుపతి.. ఇప్పుడు జవాన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ నటుడి క్రేజ్ చూసి నిర్మాతలు కూడా తనను ఎలాగైనా క్యాస్ట్ చేసుకోవాలనే ఆలచనతో అడిగినంత రెమ్యునరేషన్‌కు ఓకే చెప్పేస్తున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com