Vijay Sethupathi: షారుఖ్‌తో తలపడనున్న సేతుపతి.. త్వరలో షూటింగ్ షురూ..

Vijay Sethupathi: సౌత్ దర్శకులతో నటించడానికి బాలీవుడ్ బడా హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే షారుఖ్ ఖాన్‌లాంటి హీరో సైతం తమిళ దర్శకుడు అట్లీ చెప్పిన కథకు ఫిదా అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఓ రేంజ్‌లో ఉండబోతుందని టీజర్ చూసి ఇప్పటికే ప్రేక్షకులు అంచనా వేసేసుకున్నారు. ఇక తాజాగా షారుఖ్‌తో తలపడేందుకు విజయ్ సేతుపతి సిద్ధమయినట్టు సమాచారం.
అట్లీ, షారుఖ్ ఖాన్ మూవీ ఫైనల్ అయ్యిందని సమాచారం తప్పా ఈ సినిమా నుండి చాలాకాలం వరకు ఏ అప్డేట్ లేదు. ఇక ఈ మూవీకి 'జవాన్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించడం, విజయ్ గెస్ట్ రోల్ చేయడం లాంటివి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయ్యేలా చేశాయి.
తాజాగా జవాన్ మూవీలో షారుక్‌తో తలపడేందుకు విజయ్ సేతుపతిని విలన్‌గా ఒప్పించాడట అట్లీ. ఇప్పటికే విక్రమ్ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించి ఫుల్ మార్కులు కొట్టేసిన సేతుపతి.. షారుక్‌తో కలిసి త్వరలోనే సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడట. ఆగస్ట్ చివర్లో ప్రారంభం కానున్న చెన్నై షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి పాల్గొననున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com