Vijay Sethupathi: బాలీవుడ్ ఆఫర్ వదులుకున్న విజయ్ సేతుపతి.. అయినా ఫ్యాన్స్ హ్యాపీ..

Vijay Sethupathi: బాలీవుడ్ ఆఫర్ వదులుకున్న విజయ్ సేతుపతి.. అయినా ఫ్యాన్స్ హ్యాపీ..
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రస్తుతం ప్రతీ భాషలో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు.

Vijay Sethupathi: హీరో అవ్వడంకంటే నటుడు అనిపించుకోవడం ముఖ్యం అనుకుంటారు చాలామంది. అలా అనుకునేవారిలో ముందుంటారు విజయ్ సేతుపతి. అందుకే హీరో, విలన్, గెస్ట్ రోల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా తనకు నచ్చితే తప్పకుండా చేయడానికి ఒప్పుకుంటారు. కానీ ఓ బాలీవుడ్ ఆఫర్‌ను తను రిజెక్ట్ చేయడం వల్ల ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. ఇంతకీ ఏంటా ఆఫర్.

విజయ్ సేతుపతి ప్రస్తుతం ప్రతీ భాషలో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు. ఇప్పటికే తమిళంలో స్టార్‌గా మారిన సేతుపతి.. ఉప్పెనతో తెలుగులో అడుగుపెట్టారు. ఇక ఇటీవల ఓ మలయాళ చిత్రంలో కూడా నటించారు. ఆయన తర్వాత టార్గెట్ బాలీవుడే అని అర్ధమవుతోంది. ప్రస్తుతం కత్రినా కైఫ్‌తో కలిసి 'మెర్రీ క్రిస్ట్‌మస్' అనే చిత్రంలో నటిస్తున్నారు విజయ్ సేతుపతి. అయితే ఇప్పటికే బాలీవుడ్‌లో తన డెబ్యూ అయిపోవాల్సి ఉందట.

అమీర్ ఖాన్ నటించి, నిర్మించిన చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. ఇందులో ఓ కీలక పాత్ర కోసం అమీర్ ముందుగా సేతుపతిని సంప్రదించారట. వీరిద్దరి మధ్య స్టోరీ సిట్టింగ్ కూడా పూర్తయ్యింది. కానీ షూటింగ్ మొదలయ్యే సమయానికి విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. దీంతో ఆ ఆఫర్ నాగచైతన్య చేతికి వెళ్లింది. అయితే ఇటీవల విడుదలయిన లాల్ సింగ్ చడ్డా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో ఓ ఫ్లాప్ సినిమాను వదులుకున్నందుకు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.



Tags

Read MoreRead Less
Next Story