Aryan Khan : ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే పడే శిక్ష ఎన్నేళ్లంటే..?

సెలబ్రిటీ కొడుకు. బాలీవుడ్ బాద్‌షాకి వారసుడు. కానీ.. ఓ రేవ్ పార్టీ ఆర్యన్‌ఖాన్ లైఫ్‌ని సడన్‌గా చీకట్లోకి నెట్టేసింది. హైఫై పార్టీలు, కాస్ట్లీకార్లలో తిగిగేవాడు కాస్తా ఇప్పుడు ఖైదీగా పరాటాలు తింటున్నాడు. 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌తోపాటు అతని స్నేహితులకు నిన్న జైల్లో పరాటాలు, పప్పు-అన్నం, కొంచెం బిర్యానీ తెచ్చి పట్టారు. అదికూడా జైల్‌కి సమీపంలో ఓ బడ్డీ కొట్టు దగ్గర కొని పట్టుకెళ్లి ఇచ్చారు. జైల్లో వాళ్లంతా నిద్రలేని రాత్రి గడిపారు.
ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్‌లో పార్టీకి వెళ్లిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆర్యన్ సహా అతని స్నేహితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు.. ఇవాళ్టి నుంచి 3 రోజులు కస్టడీకి ఇచ్చింది. నిన్న కోర్టు తీర్పు రాగానే ఆర్యన్ మౌనంగా ఉండిపోయినా.. అతని ఫ్రెండ్స్ కన్నీరుపెట్టారు. వీళ్లనుంచి డ్రగ్స్ పెడ్లర్ల సమాచారం రాబట్టమే టార్గెట్‌గా NCB ఇప్పటికే ప్రశ్నలతో సిద్ధమైంది. ఎవరితో చాటింగ్ చేశారు. చాటింగ్‌ల వాడిన కోడ్ పేర్లు ఏ డ్రగ్స్‌కి సంబంధించినవి? డ్రగ్స్ అలవాటు ఎప్పటి నుంచి ఉంది..? పార్టీకి ఎవరు పిలిచారు..? మొత్తం ఎవరు ఆర్గనైజ్ చేశారు..? ఇలాంటివన్నీ ఇప్పుడు విచారణలో తేలనున్నాయి.
గోవా నుంచి ముంబై వస్తున్న క్రూయిజ్ షిప్ పార్టీలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాము చరాస్, 22 MDMA పిల్స్‌తోపాటు, 5 గ్రాముల MD మరికొన్ని మత్తుపదార్థాలు కూడా సీజ్ చేశారు. సాధారణంగా ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో శిక్షలు.. ఆయా మాదకద్రవ్యాల వినియోగాన్ని బట్టే ఉంటాయి. తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్థారణ అయితే ఏడాది జైలు, 10 వేల జరిమానాతో సరిపెతారు. కొకైన్ లాంటివి లాంటివి వాడితే ఏడాది జైలు, 20 వేల ఫైన్ ఉంటుంది. ఆ స్థాయికి మించి మత్తుమందులకు బానిసైనట్టు తెలితే 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష తప్పదు. లక్ష జరిమానా కూడా విధిస్తారు.
ఇక పెద్దమొత్తంలో డ్రగ్స్ కలిగి ఉన్నా.. డ్రగ్ పెడ్లర్‌గా ఉన్నట్టు నిర్థారణ అయినా లైఫ్ క్లోజ్ అయినట్టే. ఈ కేసులో 10 నుంచి 20 ఏళ్ల వరకూ గరిష్టంగా శిక్ష పడుతుంది. ఆర్యన్ ఖాన్‌తోపాటు మిగతా వారిపై NDPS యాక్ట్ ప్రకారం ఇప్పటికే కేసులు పెట్టారు. సెక్షన్ 8C, 20B, 27 రెడ్‌విత్ సెక్షన్ 35 కింద వీళ్లను బుక్ చేశారు. మాదకద్రవ్యాల తయారీ, అమ్మకం, కొనుగోలు, ట్రాన్స్‌పోర్ట్ కేసుల్లో ఈ సెక్షన్ 8C కేసు పెడతారు. సెక్షన్ 20B కింద ఈ డ్రగ్స్ కేసులో ఏడాది వరకూ శిక్ష పడుతుంది. ఒకవేళ దొరికిన మాదకద్రవ్యాల మొత్తం ఎక్కువగా ఉంటే 10 ఏళ్లు జైలు తప్పదు. కొకైన్ మార్పైన్ లాంటి మత్తుపదార్థార వినియోగం గుర్తించినప్పుడు సెక్షన్ 27 కేసు పెడతారు.
ఇక ఈ కేసులో పెద్దమొత్తంలో ఆర్యన్ ఖాన్ దుస్తుల్లో డ్రగ్స్ దొరికినట్టు NCP చెప్తుంటే.. ఈ వాదనను అతని తరపు లాయర్లు ఖండిస్తున్నారు. నిన్న కోర్టుల్లో వాదనల టైమ్‌లో కూడా ఆర్యన్ తరపు న్యాయవాది సతీష్ మనెషిండే ఈ అభియోగాల్ని తోసిపుచ్చారు. 1300 మంది షిప్‌లో ఉంటే ఆర్యన్ ఖాన్‌ను, అతని ఫ్రెండ్స్‌ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కావాలనుకుంటే ఆ షిప్‌నే కొనే స్థాయి ఆర్యన్‌దని.. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, బిజినెస్ లాంటివి అవసరం ఏముందని చెప్పుకొచ్చారు.
ఐతే.. తమ ప్రాథమిక దర్యాప్తులో దొరికిన ఆధారాలు, వాట్సప్ చాట్ ఆధారంగా ఆర్యన్‌కి డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందని తాము భావిస్తున్నట్టు NCB లాయర్ తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు.. చివరికి ఆర్యన్ బెయిల్ తిరస్కరించి, కస్టడీకి ఇచ్చింది. ఇవాల్టి నుంచి 7వ తేదీ వరకూ కస్టడీలో ఎలాంటి సమాచారం రాబడతారు అనేది ఉత్కంఠగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com