ప్రేమకి వయసుతో సంబంధం లేదు : ముగ్ధ గాడ్సే

నటుడు రాహుల్ దేవ్ తో లవ్ జర్నీపై తాజాగా నటి ముగ్ధ గాడ్సే స్పందించింది. ఇద్దరి మధ్య దాదాపు 14ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా.. అదెప్పుడూ సమస్యగా అనిపించలేదని తెలిపింది. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని అన్నారు. 'ఇష్టమైన వ్యక్తిని ఎంచుకోవడం అంటే షాపింగ్ కాదు కదా. నచ్చిన కలర్ బ్యాగ్ లో కొనుక్కోవడానికి' అని పేర్కొంది. ఎవరైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చని తెలిపింది.
దాదాపు 7 ఏళ్లుగా కలిసే ఉంటున్న ఈ జోడీ.. కామన్ ఫ్రెండ్ పెళ్లిలో కలిసినట్లు చెప్పుకొచ్చింది. కాగా, రాహుల్ దేవ్ గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు రినాను వివాహం చేసుకున్నాడు. కానీ క్యాన్సర్ బారిన పడిన రీనా 2009లో మరణించడంతో రాహుల్ ఒంటరివాడయ్యాడు. వీరికి సిద్ధాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అటు మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ముగ్దా గాడ్సే.. మాధుర్ భండార్కర్ 'ఫ్యాషన్'తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com