Who is Munmun Dhamecha : బాలీవుడ్ డ్రగ్స్ .. ఎవరీ మున్‌మున్ ధమేచ.. ?

Who is Munmun Dhamecha: బాలీవుడ్‌లో ఇప్పుడు డ్రగ్స్ ఇష్యూ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ డ్రగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆర్యన్‌ఖాన్ తో పాటుగా మరో ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తాజాగా బెయిల్ కోసం ఆర్యన్‌ఖాన్ ముంబై హైకోర్టు ఆశ్రయించగా .. అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఫిటిషన్ తిరస్కరణకి గురైంది.
ఆర్యన్‌కు మూడురోజుల కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆర్యన్‌ఖాన్‌తో సహా మరో ఏడుగురికి కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కోర్టు తాజా తీర్పుతో అక్టోబర్ 7 వరకు వీరందరూ NCB కస్టడీలోనే ఉండనున్నారు. అయితే ఈ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖన్ తో పాటుగా మున్‌మున్ ధమేచ అనే యువతి, ఆర్బాజ్ సేతు మర్చంట్‌లతో పాటు మరికొందరిని ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది.
ఇందులో ఆర్బాజ్ సేతు మర్చంట్.. ఆర్యన్‌ఖాన్ కి స్నేహితుడు, సినీ నటుడు కూడా.. మున్‌మున్ ధమేచ అనే యువతి ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయం పైన అరా తీయగా ఆమె ఒక మోడల్ అని బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని తెలిసింది. మున్‌మున్ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా.. ఆమె వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు.. చదువు అంతా సాగర్ లోనే కంప్లీట్ చేయగా... పై చదువులకోసం భోపాల్ కి వెళ్ళింది.
ఇటీవల ఆమె తల్లి మరణించడంతో తన సోదరుడు ప్రిన్స్ ధమేచతో ఢిల్లీలో ఉంటోంది. బాలీవుడ్ లోని పలువురు నటులతో మంచి పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటుగా కాగా ఈ కేసులో నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com