Yo Yo Honey Singh: హనీసింగ్ డాక్యుమెంటరీ, ఆస్కార్ విజేతే ప్రొడ్యూసర్

Yo Yo Honey Singh: హనీసింగ్ డాక్యుమెంటరీ, ఆస్కార్ విజేతే ప్రొడ్యూసర్
హిప్ హాప్ గాయకుడు హనీసింగ్ పై డాక్యుమెంటరీ; ఆస్కార్ గ్రహీత గునీత్ మోంగా నిర్మాణ సారధ్యంలో తెరకెక్కనున్న డాక్యు-ఫిల్మ్

రెండు సార్లు ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకున్న నిర్మాతగా గునీత్ మోంగా చరిత్ర సృష్టించారు. 2019లో పీరియడ్ కు, తరువాత 2023లో ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యూ ఫిల్మ్ కు నిర్మాతగా రెండు సార్లు ఆస్కార్ వేదికపై విజయకేతనం ఎగురవేసిన గునీత్ మోంగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ ప్రముఖ హిప్ హాప్ గాయకుడు యోయో హనీసింగ్ పై డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హనీ సింగ్ తన పుట్టిన రోజు పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశాడు. రాపర్ గా, హిప్ హాప్ గాయకుడిగా పాపులారిటీ సంపాదించుకున్న హనీసింగ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే అనూహ్యంగా కొన్నిరోజులు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ ఇప్పుడిప్పుడే బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. శిఖ్యా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై గునీత్ మోంగా నిర్మిస్తున్న ఈ డాక్యుమెంటరీకి మోజెజ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి హనీ సింగ్ జీవితంలో ఎవరికీ తెలీని కోణాలను ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరిస్తుందేమో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story