సినిమాల్లో, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ లెజెండ్

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. ఆడిలైడ్‌లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలకు బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమార్తె తేజస్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలకృష్ణ వీడియోకాల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ సంతకంతో కూడిన పంచె, చొక్కాను వేలం వేశారు.
తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన కృషి గుర్తు చేశారు బాలకృష్ణ. ముఖ్యమంత్రిగా పేదల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచంలో ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. ఎన్టీఆర్ ప్రజారంజక పాలన ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. తెలుగువారంతా గర్వించదగిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎన్టీఆర్ తెలుగువారందరికీ బంధువు అన్నారు బాలకృష్ణ సతీమణి వసుంధర. తెలుగు ప్రజలకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. మహిళల పట్ల ఎన్టీఆర్ ఎంతో గౌరవంగా ఉండేవారని అన్నారు. క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించడం ద్వారా బసవతారకం చివరి కోరికను తీర్చారని గుర్తు చేసుకున్నారు.
సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్ లెజెండ్‌గా నిలిచారని అన్నారు బాలకృష్ణ కుమార్తె తేజస్విని. తాను ఎక్కువ సమయం తాతగారితో గడపలేకపోయానని అన్నారు. ఎన్టీఆర్ జీవనశైలి, హార్డ్ వర్క్ గురించి చిన్నప్పటి నుంచి వింటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ స్పూర్తిదాయకమన్నారు. ఆయన మనువరాలిగా పుట్టినందుకు గర్విస్తున్నాని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com