మోదీ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు

మోదీ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు
X

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీంతో భారత్‌ అద్భుతంగా రూపాంతరం చెంది, ప్రపంచ వరుసలో నిలిచింది. ఐడియా నుండి ఇన్నోవేషన్ వరకు దేశాన్ని స్టార్టప్‌ ల్యాండ్‌స్కేప్‌గా మార్చేశారు మోదీ. కోవిడ్‌ సమయంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. 50 శాతం ఎగుమతులు పెరగడంతో దేశ ఆర్థిక రంగం బలోపేతం అయ్యింది. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన మనదేశం బ్రిటన్‌ను వెనక్కి నెట్టింది. అన్నిటికి మించి జాతీయ రహదారుల నిర్మాణంలోనూ మోదీ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంది.

జనధన్‌ బ్యాంకు ఖాతాలు, నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధానాలతో దేశంలో తన మార్కు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు ప్రధాని మోదీ. నోట్ల రద్దుపై ఎన్ని విమర్శలు వచ్చినా.. బీరువాల్లోనూ.. నేల మాలిగల్లోనూ ముక్కిపోయిన డబ్బును చలామణిలోకి తెచ్చి ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చేశారు మోదీ. 2013 నుంచి దేశంలో స్థూల, మార్కెట్‌ అంచనాల పరంగా చెప్పుకోదగ్గ సానుకూల పరిణామా లు కూడా సంభవించాయి. ఇవన్నీ కూడా మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ తమ ‘ట్రాన్స్‌ఫార్మారేషన్‌’ నివేదికలో పేర్కొంది. 2013లో ఇచ్చిన నివేదికతో పోల్చితే ఇవాళ దేశం పూర్తి భిన్నంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

గతంలో 12రకాలకు పైగా ఉన్న వివిధ పన్నులను తొలగించి ఆ స్థానంలో జీఎస్టీ రూపంలో ఒకే పన్ను విధానాన్ని తెచ్చారని, డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయాని, దేశ ఆర్థిక స్థిరీకరణకు జీడీపీనే సింబల్‌ అని నివేదికలో వివరించింది. 4.5 శాతంగా ఉన్న ఎగుమతుల మార్కెట్‌ 2031 నాటికి రెండింతలకు పైగా పెరుగుతుందని ట్రాన్స్‌ఫార్మారేషన్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం 1.82 లక్షలుగా ఉందని, ఇది 2032 నాటికి 4.30 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది. కొన్నేళ్లలోనే భారత్‌ డిజిటల్‌ లావాదేవీలు, తక్షణ చెల్లింపుల్లో ‘గ్లోబల్‌ లీడర్‌’ అవుతుందని స్పష్టం చేసింది. మొత్తానికి అద్భుత విదేశాంగ, రక్షణ, ఆర్థిక విధానాలతో మోదీ పాలన ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక స్థానం దక్కేలా చేసింది.

Next Story