జూన్‌ 1 నుంచి వార్డు పరిపాలన : GHMC

జూన్‌ 1 నుంచి వార్డు పరిపాలన : GHMC

హైదరాబాద్‌లో జూన్‌ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తుంది. సమస్యల సత్వర పరిష్కారానికి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 150 వార్డులలో 10 మంది అధికారుల బృందంతో వార్డు పాలన వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. నగర పౌరులకు అతి సమీపంలో వార్డు ఆఫీస్‌లను ఏర్పాటు చేసి అందులో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, వార్డు ఎంటమాలజిస్ట్‌, వార్డు ఇంజినీర్, వార్డు టౌన్ ప్లానర్‌తోపాటు వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్‌, వార్డు శానిటరీ జవాన్‌, జలమండలి అధికారులు, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటితో వార్డు ఆఫీస్‌లను సకల సదుపాయాలతో సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story