2000 Notes: పెట్రోల్‌ బంకులకు వరదలా రూ.2వేల నోట్లు

2000 Notes: పెట్రోల్‌ బంకులకు వరదలా రూ.2వేల నోట్లు
X

పెట్రోల్‌ బంక్‌లకు 2000 రూపాయల నోట్ల వరదలా వచ్చి పడుతున్నారు. చాలా మంది కస్టమర్లు 2000 రూపాయల నోటు ఇవ్వడంతో చిల్లర ఇవ్వడం తమకు ఇబ్బందిగా మారుతోందని పెట్రోలియం డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందిని ప్రస్తావిస్తూ ఆర్బీఐకి ఆల్‌ ఇండియా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్స్‌ లేఖ రాసింది. తమకు తగినంతగా చిన్న డినామినేషన్లలో నోట్లు ఇవ్వాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. గతంలో తమకు కస్టమర్లు ఇచ్చే నోట్లలో 2000 రూపాయల నోట్లు కేవలం పది శాతం ఉండేవని, ఇపుడు వస్తున్న నోట్లలో 90 శాతం 2000 రూపాయల నోట్లు ఉంటున్నాయని అసోసియేషన్‌ పేర్కొంది.

Tags

Next Story