అసేతు హిమాచలం... ఖండాంతరాలు దాటిన ఎన్టీఆర్ కీర్తి

అసేతు హిమాచలంస్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ కీర్తి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. శత జయంతి వేళ ఎన్టీఆర్ చిత్రాలు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో తళుక్కున మెరిశాయి. ప్రపంచ పర్యాటకుల్ని కన్ను తిప్పకుండా చేశాయి. 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఏకంగా 24 గంటలపాటు డిస్‌ప్లే చేయడం సంచలనంగా మారింది. ఈ డిస్‌ప్లే లో ఎన్టీఆర్ పోషించిన వివిధ క్యారెక్టర్లను ప్రదర్శించారు. ఎన్టీఆర్ చూపిన విశ్వరూపాలకు సంబంధించిన ఫోటోలను ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున డిస్ ప్లే అయ్యాయి.
డిస్‌ప్లే ప్రకటనతో ఎన్టీఆర్ కీర్తి విదేశాల్లో మరింత ప్రాచుర్యంలోకి రానుందని ఎన్నారై టీడీపీ నేతలు చెప్పారు.ప్రపంచంలోని ఎన్టీఆర్ అభిమానులంతా దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. సెకను డిస్‌ప్లే కు కూడా భారీగా వసూలు చేసే టైమ్ స్క్వేర్‌లో.. ఏకంగా 24 గంటల పాటు అన్న ఎన్టీఆర్ చిత్రాలను డిస్‌ప్లే ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎన్నారైలు అంటున్నారు.
మరోవైపు కనుల విందుగా మారిన అన్న ఎన్టీఆర్ విశ్వరూపాలను ఎన్నారైలు,స్థానికులు,చిన్నారులు, న్యూయార్క్‌కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యాటకులు, ఊపిరి బిగబట్టి మరీ టైమ్ స్క్వేర్‌లో చూస్తూ ఆనందించారు. డిస్‌ప్లే లో కనిపిస్తుంది ఎవరు? ఆయన విశేషం ఏంటి? అంటూ ఆసక్తిగా తెలుసుకున్నారు. విదేశీయులు కూడా ఎన్టీఆర్ సినిమాలు,రాజకీయం, వ్యక్తిత్వం లాంటి అనేక విషయాలపై ఎన్టీఆర్ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేశారు.ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని అమెరికాలోని 28 నగరాలకు చెందిన టీడీపీకి చెందిన ఉన్న కార్యనిర్వాహక కమిటీ సభ్యులంతా కలసి చేపట్టిన ఈ కార్యక్రమం ఉత్సహాంగా సాగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులని కేరింతలు కొట్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com