హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రాపర్టీ షో.. 100కు పైగా స్టాల్స్..

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రాపర్టీ షో.. 100కు పైగా స్టాల్స్..
హైదరాబాద్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ట్రెడా ప్రాపర్టీ షో విజయవంతంగా నిర్వహించేందుకు ట్రెడా కసరత్తు

సొంతింటి కల సాకారం కోసం ఎదురుచూస్తోన్న ప్రజల కోసం హైదరాబాద్‌ హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు రియాల్టీ ఆర్గనైజేషన్‌ ట్రెడా ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు లెవెన్త్‌ ఎడిషన్‌ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రాపర్టీలన్నింటి వివరాలను ఒక్కచోట చేర్చి ప్రజలకు పూర్తి వివరాలు అందించేలా ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ప్రాపర్టీ షో ద్వారా ప్రముఖ రియాలిటీ సంస్థలు, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ అన్ని ఒకే వేదికపైకి రానున్నాయని, ఈ ప్రాపర్టీషోకు జనం పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ట్రెడా ప్రతినిధులు తెలిపారు.

మరో ప్రాపర్టీ షోకు వేదికకానున్న హైదరాబాద్‌

హైదరాబాద్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో

అక్టోబర్‌ 1-3 వరకు ట్రెడా ప్రాపర్టీ షో

విజయవంతంగా నిర్వహించేందుకు ట్రెడా కసరత్తు

ప్రాపర్టీ షోలో ఏర్పాటు కానున్న 100కు పైగా స్టాల్స్‌

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోన్న ట్రెడా


Tags

Read MoreRead Less
Next Story