పెద్దోళ్లు కొట్టుకుంటే అమాయకులు బలైనట్టుగా.. ఆ డీల్ రద్దైతే 11లక్షల జాబ్స్ గోవిందా..!

పెద్దోళ్లు కొట్టుకుంటే అమాయకులు బలైనట్టుగా.. ఆ డీల్ రద్దైతే 11లక్షల జాబ్స్ గోవిందా..!
ఆ గ్రూపులో పనిచేస్తున్న సుమారు 11 లక్షల మంది ఉద్యోగాలు పోవడం ఖాయమంటుంది ఎఫ్‌ఎంసిజి డిస్ట్రిబ్యూటర్స్, ట్రేడర్స్ అసోసియేషన్.

పెద్దోళ్లు కొట్టుకుంటే అమాయకులు బలైనట్టుగా.. ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ డీల్ రద్దైతే 11లక్షల జాబ్స్‌పై ఎఫెక్ట్ పడనుంది. బిగ్ బజార్, ఈజీడే, నీలగిరి, సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీతో సహా అన్ని వ్యాపారాలు ప్రజంట్ పనిచేస్తూనే ఉన్నాయి. ఉద్యోగులు మరియు సరఫరాదారులు జీవనోపాధిని పొందుతున్నారు.


ప్రస్తుతానికి వివాదం నడుస్తోంది. అయినా డీల్ తో సంబంధం లేకుండా సంస్థలు నడుస్తున్నాయి. ఒకవేళ అమెజాన్ అడ్డంకుల కారణంగా ఏమాత్రం డీల్ ఆగిపోయినా కూడా ఫ్యూచర్ నిర్వహించే పరిస్థితులు లేవు. దీంతో కంపెనీ మూసేయడం మినహా మరోమార్గం లేదు. దీనివల్ల ఆ గ్రూపులో పనిచేస్తున్న సుమారు 11 లక్షల మంది ఉద్యోగాలు పోవడం ఖాయమంటుంది ఎఫ్‌ఎంసిజి డిస్ట్రిబ్యూటర్స్, ట్రేడర్స్ అసోసియేషన్.

ఫ్యూచర్ గ్రూపునకు 450 నగరాల్లో దాదాపు 2000 స్టోర్లున్నాయి. 6వేల మంది వెండర్స్, సరఫరాదారులున్నారు. గత ఆగస్టులో ఫ్యూచర్ గ్రూపును మొత్తంగా రిలయన్స్ కొనుగోలు చేసింది. అయితే అమెజాన్ కూపన్ విభాగంలో తనకున్న 49శాతం వాటా సాకుగా చూపించి డీల్ కు అడ్డు పడుతోంది. ప్రస్తుతం లీగల్ కేసు నడుస్తోంది. మొత్తం డీల్ వాల్యూ 24713 కోట్లు.

Tags

Read MoreRead Less
Next Story