'జీప్' 2021 వర్షన్ లాంచ్.. సరికొత్త ఫీచర్లతో..

జీప్ 2021 వర్షన్ లాంచ్.. సరికొత్త ఫీచర్లతో..
ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే టోకెన్ రూపంలో రూ.50,000 చెల్లించాలి.

ప్రముఖ వాహన సంస్థ జీప్.. 2021 వర్షన్‌ను లాంచ్ చేసింది. నాలుగు వేరియంట్లలో ఈ జీప్ లభ్యమవుతుంది. దీంతో పాటు 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మోడల్లోని యానివర్సరీ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఎక్స్‌షోరూంలో ఈ వాహనం ప్రారంభ ధర రూ.16.99 లక్షలుగా సంస్థ నిర్ధేశించింది.

స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్ అండ్ మోడల్ ఎస్ వేరియంట్లలో లభ్యమవుతున్న జీప్.. టాప్ స్పెక్ అయిన మోడల్ ఎస్ వేరియంట్ ఖరీదు రూ.24.49 లక్షలు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమవగా.. డెలివరీలను ఫిబ్రవరి 2 నుంచి అందజేయనుంది సంస్థ. ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే టోకెన్ రూపంలో రూ.50,000 చెల్లించాలి. దేశ వ్యాప్తంగా జీప్ డీలర్ల వద్ద లేదా ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు.

ఎస్ యూవీ ఫీచర్లు ఎల్‌ఈడీ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంపులతో పాటు ఫ్రంట్ బంపర్, సెంట్రల్ ఎయిర్ ఇన్టెక్ పాటు డ్యూయల్ టోన్ 18- అంగుళాల అల్లాయ్ వీల్స్, పానోరామిక్ సన్ రూఫ్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు వంటి అప్డేట్లు ఇందులో ఉన్నాయి. అవి కాకుండా ఈ సరికొత్త 2021 జీప్ కంపాస్ మోడల్లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టంతో కూడిన యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఈ సరికొత్త యూవీలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మొత్తం 7 కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story