యంగ్ జనరేషన్‌కి కిక్కిచ్చే బైక్.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ..

ద్విచక్ర వాహనాల సంస్థ టీవీఎస్.. మార్కెట్లోకి మరో కొత్త మోడల్ బైక్‌ను విడుదల చేసింది. సంస్థ నుంచి వచ్చిన అపాచీ మోడల్‌కు సంబంధించిన 2021 వర్షన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదే అపాచీ ఆర్టీఆర్ 160 4వీ. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.07 లక్షలుగా నిర్దేశించింది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. గత మోడల్‌తో పోలిస్తే ఈ మోటార్ సైకిల్ వేరియంట్ల ధరలను కాస్త పెంచింది. రెండు మోడళ్లలో దాదాపు రూ.3000 ధరను పెంచడంతో పాటు కొన్ని మార్పులు చేసింది. బరువు 2 కేజీలు తగ్గించింది. ఇప్పుడు అపాచీ ఆర్టీఆర్ 160 4వీ డ్రమ్ వేరియంట్ 145 కేజీ బరువుంటే.. డిస్క్ వేరియంట్ 147 కేజీల బరువుంటుంది.
డిజైన్స్
ఈ సరికొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్ బైక్ ఆల్ న్యూ డ్యూయల్ టోన్ సీటుతో అందంగా ఉంటుంది. అంతే కాకుండా అదనపు ఆకర్షణగా ఎల్‌ఈడీ హెడ్ ల్యాంపులు ఇందులో ఉంటాయి. మూడు రంగులలో లభ్యమవుతున్న ఈ మోటార్ సైకిల్.. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ లాంటి కలర్స్‌లో ఉన్నాయి.
ఇంజిన్
ఈ 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోడల్ 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 9250 ఆర్సీఎం వద్ద 14.73 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2020 మోడల్‌తో పోలిస్తే ఇది 1.5 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 0.6 ఎన్ఎం టార్క్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ సరికొత్త అపాచీ మోటార్ సైకిల్ 5 స్పీడ్ స్టాండార్డ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com