Kawasaki Ninja: మార్కెట్లోకి సరికొత్తగా క్రేజీ బైక్ 'కవాసాకి'.. ఫీచర్లు, ధర చూస్తే..

Kawasaki Ninja: మార్కెట్లోకి సరికొత్తగా క్రేజీ బైక్ కవాసాకి.. ఫీచర్లు, ధర చూస్తే..
మార్కెట్లో ఎన్ని బైకులున్నా కొత్త మోడల్ బైక్ వచ్చిందంటే కళ్లింతవి చేసుకుని చూస్తుంది యువత.

Kawasaki Ninja: యువ బైకర్లను దృష్టిలో పెట్టుకుని కవాసాకి సంస్థ నుంచి సరికొత్త సూపర్ బైక్ మార్కెట్లో లాంచ్ అయింది. 2022 కవాసాకి నింజా 650. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చి రూ.6.61 లక్షలుగా నిర్ధేశించింది.

ఇక ఈ మోటార్ పైకిల్ రెండు కలర్స్‌లో లభ్యమవుతుంది. లైమ్ గ్రీన్, పెరల్ రోబోటిక్ వైట్ రంగుల్లో వస్తుంది. ఇప్పటికే నింజా 650 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నుంచి ఈ బైక్‌లు స్టోర్స్‌లో లభ్యమవుతాయి.

డిజైన్

ఇది ఇంతకు ముందు వచ్చిన 2021 వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. షార్పర్ లుకింగ్ ఫేరింగ్, పునరుద్ధరించబడిన హెడ్ ల్యాంపులు, అప్డేటెడ్ గ్రాఫిక్స్ లాంటివి ఇందులో ఉన్నాయి.

ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు

ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు

అండర్ బెల్లీ ఎక్సాహాస్ట్

స్పిట్ సీట్లు

క్లీన్ ఆన్-హ్యాండిల్ బార్లు

విండ్ స్క్రీన్

15-లీటర్ల ఫ్యూయల్ ట్యాంకు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఫీచర్లు..

ఈ 2022 నింజా 650లో 4.3 అంగుళాల టీఎప్టీ ఇన్‌స్ట్రుమెంట్ డిస్ ప్లే ఉంది. ఇందులో లేటెస్ట్ ఐటెరేషన్ కనెక్టెడ్ టెక్నాలజీని పొందుపరిచారు. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కవాసాకి రేడియాలజి యాప్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. రైడర్ టెలిమెట్రి డేటాకు సంబంధించి ఓడీఓ, ట్రిప్ వివరాలు లాంటి మొబైల్ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇంజన్..

ఈ సూపర్ బైక్ 649 సీసీ ప్యార్లెల్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 8000 ఆర్పీఎం వద్ద 67 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 6700 ఆర్పీఎం వద్ద 64 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6- స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది. వీటితో పాటు ఈ సరికొత్త నింజా 650 మోటార్ సైకిల్లో డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంది. 41 ఎంఎం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, 130 ఎంఎం మోనోషాక్ అబ్జార్బార్లను సస్పెన్షన్ సెటప్‌గా ఉంచారు. ఇవి కాకుండా 300 ఎంఎం డ్యూయల్ సెమీ ఫ్లోటింగ్ పెటల్ డిస్కులు, డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్లు, 220 ఎఎం పెటల్ డిస్క్‌తో కూడిన సింగిల్ పిస్టన్ రియర్ క్యాలిపర్ కూడా ఇందులో ఉన్నాయి. భారత మార్కెట్లో కవాసాకి నింజా 650కి పోటీగా హోండా సీబీఆర్ 650ఆర్, సీఎఫ్ఎంఓటీఓ 650 లాంటి మోటార్ సైకిళ్లు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story