Adani : భారీగా అదానీ షేర్ల పతనం

అదానీ షేర్లలో పతనం ఇన్వెస్టర్లకు మరింత కంగారు పెట్టిస్తోంది. అదానీ షేర్లను కొనేవాడే లేకపోవడంతో ఇన్వెస్టర్లు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఇటీవల కోలుకున్నట్లు కన్పించిన అదానీ ఎంటర్ ప్రైజస్ షేర్ నిన్న 11 శాతంపైగా పడిపోయింది. నిన్న ఒక్కరోజే అదానీ షేర్ల మార్కెట్ విలువ 50వేల కోట్ల రూపాయలు తగ్గింది. కేవలం ఒక్క నెలలో అదానీ గ్రూప్ షేర్ల విలువ 11 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. తనకు అనుకూల వ్యాసాలను అదానీ గ్రూప్ స్వయంగా రాయించిందని వికీపీడియా చేసిన ప్రకటన అదానీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ విల్మర్ షేర్లలో అందరూ అమ్మేవారే ఉండటం... కొనేవారు లేకపోవడంతో .. ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

