Adani : 22వ స్థానానికి పడిపోయిన అదానీ గ్రూప్

Adani : 22వ స్థానానికి పడిపోయిన అదానీ గ్రూప్
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ప్రారంభమైన డౌన్ ఫాల్ ఇంకా కొనసాగుతోంది

స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్లు రెడ్ జోన్ లో ట్రేడ్ అయ్యాయి. అదానీ నికర విలువ మరింత తగ్గింది. ప్రపంచ టాప్ 20 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయారు. సోమవారం అదానీ నికర విలువ USD 2.4 బిలియన్లకు పడిపోయింది. ఈ రోజు ప్రారంభం నుంచే బేరిష్ గా నమోదయ్యాయి. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ప్రారంభమైన డౌన్ ఫాల్ ఇంకా కొనసాగుతోంది.


అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్ మిషన్ ఐదు శాతం క్షిణించగా, అదానీ పవర్, అదానీ గ్రీన్ మార్కెట్ వ్యాల్యుయేషన్ లో 4.99 శాతం నష్టపోయాయి. వాటితో పాటు, ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎసీసీ, అంబుజా సిమెంట్, ఎన్డీటీవీల షేర్ల అమ్మకాల కారణంగా రెడ్ జోన్ లో ట్రెడ్ అయ్యాయి. ప్రపంచ బిలియనీర్ జాబితాలో అదానీ మరోసారి టాప్ లూజర్ గా అవతరించారు. స్టాక్ విక్రయాల కారణంగా నికర విలువ తగ్గి అదానీ 22వ స్థానానికి పడిపోయారు. డిసెంబర్ 13, 2022న USD 134.2 బిలియన్ల నికర విలువ ఉండగా ప్రస్తుతం USD 55.6 కు పడిపోయింది. ప్రస్తుతం భారత్ లో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story