ఎనిమిదిన్నర నెలల్లో రూ.81లక్షల కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల పంట

ఎనిమిదిన్నర నెలల్లో రూ.81లక్షల కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల పంట
మార్కెట్లో స్మార్ట్ గా వ్యవహరించాలి.. ఏమోషన్స్ తో కాదు.

మార్చిలో మార్కెట్ పతనంలో అంతా అయిపోయింది అనుకున్నారు. ఇక స్టాక్ మార్కెట్ వేస్ట్ అంటూ నిట్టూర్చారు. అంతేకాదు చాలామంది మదుపుదారులు పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. కానీ తెలివైన ఇన్వస్టర్లు దీనినే అనుకూలంగా మలుచుకున్నారు. మంచి స్టాక్స్ చూసి తక్కువ ప్రైస్ లో సొంతం చేసుకున్నారు ఫుల్లుగా సంపాదించారు. ఇందుకు లేటెస్ట్ డేటా అద్దం పడుతుంది.

రికార్డు స్థాయిలో మార్కెట్ విలువ

BSE ప్రస్తుతం వాల్యూ ఎంతో తెలుసా అక్షరాలా రూ.182.81 లక్షల కోట్లు. అంటే ఇన్వెస్టర్ల సంపద ఇది. ఇందులో పై రూ.82లక్షల కోట్లు దాదాపు మార్చి తర్వాత అంటే 8 నెలల 15 రోజుల్లో సంపాదించిందే. అంటే ఇన్వెస్టర్ల విలువల ఎనిమిదిన్నర నెలల్లో ఏకంగా రూ.82లక్షల కోట్లు పెరిగింది. మార్కెట్ మార్చి 23న క్రాష్ అయినప్పుడు రూ. 101 లక్షల కోట్లు మాత్రమే. సెన్సెక్స్, నిఫ్టీ కనీవినీ ఎరుగని రీతిలో అప్పుడు పడిపోయింది. బిగ్గెస్ట్ ఫాల్ ఎవర్ ఇన్ మార్కెట్ హిస్టరీ. సెన్సెక్స్ 25981 వద్ద క్లోజ్ కాగా.. నిఫ్టీ 7610 వద్ద ముగిసింది. ఆరోజు ఇన్వెస్టర్లకు రక్తకన్నీరే.

రికార్డుస్థాయిలో అప్

మళ్లీ మార్కెట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. మార్చి 23 హిస్టారిక్ క్రాష్ తర్వాత నుంచి ఇప్పటికి అంటే 8 నెలల 15 రోజుల తర్వాత 20120 పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది. అంటే 77.44శాతం గెయిన్ అయింది. అటు నిఫ్టీ ఏకంగా 5920 పాయింట్ల పెరిగింది. అంటే ఇది కూడా దాదాపు 77శాతం పెరిగింది.

లాభాలే లాభాలు..

మార్కెట్ క్రాష్ అయిందని భావొద్వేగంతో నిర్ణయం తీసుకుని బయటకు వచ్చినవాళ్లు లాభాలు మిస్ అయ్యారు. మార్కెట్లో ఉండి అప్రమత్తంగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటున్నారు. అందుకే అంటారు.. మార్కెట్లో స్మార్ట్ గా వ్యవహరించాలి.. ఏమోషన్స్ తో కాదు.

Tags

Read MoreRead Less
Next Story