Adani Group : బ్యాంకు రుణాలను ముందే చెల్లిస్తున్న అదానీ గ్రూప్

Adani Group : బ్యాంకు రుణాలను ముందే చెల్లిస్తున్న అదానీ గ్రూప్
బ్యాంకు రుణాల విషయంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతుండగా... ముందస్తుగా రుణాలను చెల్లించేందుకు రెడీ అయింది అదానీ గ్రూప్.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను గడువు కంటే ముందుగా... చెల్లించేందుకు రెడీ అయింది అదానీ గ్రూప్. బ్యాంకులకు అదానీ గ్రూప్ పై తప్పుడు అభిప్రాయం రాకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. $500 మిలియన్ల రుణాన్ని ముందుగానే చెల్లిస్తున్నారు. హిండెన్ బర్గ్ నివేధిక తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువ $100 బిలియన్ డాలర్లకుపైగా క్షిణించింది. దీంతో బ్యాంకులు రీఫైనాన్స్ చేయడానికి వెనకాడుతున్నాయి. బ్యాంకులకు అదానీ గ్రూప్ పై నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకుగానే ముందుగానే బకాయిలు కడుతున్నారు.


అదానీ గ్రూప్ కంపెనీలకు ప్రపంచ బ్యాంకులు ఫైనాన్స్ చేయడానికి వెనకాడుతున్నాయి. దీంతోపాటు, భారతీయ వ్యాపారవేత్తలతో కలిసి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి బహుళ బిలియన్ డాలర్ల ప్రణాళికలను నిలిపివేస్తున్నట్లు ప్రాన్స్ కు చెందిన ఓ కంపెనీ తెలిపింది. విదేశాలలో ఉన్న అదానీ గ్రూప్ కంపెనీల పనితీరుపై ఆయా దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ వారం అదానీ గ్రూప్ స్టాక్ లు కొంత మెరుగైనప్పటికీ, రుణాల విషయంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే అదానీ గ్రూప్ ముందస్తుగా రుణాలను చెల్లించేందుకు రెడీ అయింది.

Tags

Next Story