Adani Group : కంపెనీ వాటాలను అమ్ముతున్న అదానీ సంస్థ

ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. నిధుల కోసం ప్రమోటర్లు నేరుగా తమ వాటాలో కొంత భాగాన్ని సెకండరీ మార్కెట్లో విక్రయించారు. బ్లాక్ డీల్స్ ద్వారా GQG పార్ట్‌నర్స్ అనే అమెరికా ఈక్విటీ పెట్టుబడుల సంస్థకు 15 వేల 400 కోట్ల విలువైన షేర్లను అమ్మింది. గ్రూప్‌లోని నాలుగు కంపెనీల్లో తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించారు. వచ్చే కొన్ని నెలల్లో అదానీ గ్రూప్ సుమారు 16 వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించాల్సి ఉంది.
ఈ బ్లాక్ డీల్ కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల వాటా 3.39 శాతం వాటా తగ్గనుంది. అదానీ పోర్ట్స్‌లో 4 శాతం వాటాను అదానీ గ్రూప్ అమ్మేసింది. వీటితో పాటు అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5 శాతం, అదానీ గ్రీన్‌లో 3.5 శాతం వాటాను అమెరికా సంస్థకు అమ్మారు. కొత్తగా అప్పులు పుట్టక పోవడంతో అదానీ గ్రూప్ ప్రమోటర్లు... తమ వాటాల అమ్మకానికి దిగినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com