Adani Shares : కుప్పకూలుతున్న అదానీ షేర్లు

Adani Shares : కుప్పకూలుతున్న అదానీ షేర్లు
రోజుకొక బ్యాడ్ న్యూస్; అవినీతి భాగోతాలను వెలికి తీస్తోన్న విదేశీ పరిశోధనా సంస్థలు, పలు వార్తా సంస్థలు

మొన్నటిదాకా ఇన్వెస్టర్ల డార్లింగ్‌గా ఉన్న అదానీ గ్రూప్‌ షేర్లు... ఇపుడు వారికి సింహ స్వప్నంగా మారాయి. కొన్ని షేర్లలో వరుసగా వారం రోజుల నుంచి కొనే నాథుడు లేకపోవడంతో ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. తమ వద్ద ఉన్న షేర్ల ధరలు 5 శాతం చొప్పున రోజూ పడుతున్నా... చూస్తూ ఊరుకోవడం తప్ప... ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ షేర్లలో కొనే నాథుడే లేడు. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 71.65 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 57.50 శాతం,అదానీ గ్రీన్‌ ఎనర్జీ 72.10, అదానీ టోటల్‌ గ్యాస్‌ 78.65,అదానీ విల్మర్‌ 28.50, అదానీ 26.66,అదానీ పోర్ట్స్‌ 40.36,31.69,ఏసీసీ 23.21 శాతం మేర నష్టపోయాయి.


అదానికి బ్యాడ్‌ టైమ్‌ ప్రారంబమైనప్పటి నుంచి రోజూ ఏదో ఒక నెటివ్‌ న్యూస్‌ బయటపడుతోంది. ముఖ్యంగా విదేశీ రీసెర్చి సంస్థలు, వార్తా సంస్థలు పలు అవినీతి భాగోతాలను వెలికి తీస్తున్నాయి. దీంతో ఏరోజున..ఏ కంపెనీ వార్త వెలుగులోకి వస్తుందో అన్న టెన్షన్‌ ఇన్వెస్టర్లలో ఉంది. గ్రూప్‌ బ్లూచిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజస్‌ కాస్త కోలుకున్నట్లు కన్పించినా... మళ్ళీ ఈ షేర్‌లో పతనం ప్రారంభమైంది. అదానీ గ్రూప్‌లోని 9 షేర్లూ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ప్రతి షేర్‌ కనీసం 25 శాతం నష్టపోగా... గరిష్టంగా 80 శాతంపైగా నష్టపోయింది.


అదానీ గ్రూప్‌లోకి రాకముందు అంబుజా సిమెంట్‌, ఏసీసీ షేర్లకు మంచి పేరుండేది. అదానీ కొనుగోలు చేయడంతో ఈ షేర్లు కూడా అకారణంగా పెరిగాయి. దీంతో ఈ రెండు షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి వస్తోంది.ఈ ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి అదానీ ట్రాన్స్‌ మిషన్‌ 82 శాతం నష్టపోయింది. అలాగే ఏదో ఒక ధరకు బయటపడిదామని భావిస్తున్నా... కొనేవారు లేకుండా పోయారు. అదానీ గ్రీన్‌ ఎనర్జి 77 శాతం నష్టపోయింది. మార్కెట్‌ ప్రారంభం కాగానే... తమ దగ్గరున్న షేర్లను నష్టాల్లో చూసుకోవడం తప్ప... ఏమీ చేయలేని స్థితిలో ఇన్వెస్టర్లు ఉన్నారు.


Tags

Read MoreRead Less
Next Story