Gautam Adani: ప్రపంచంలోని మొదటి ఐదు బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

Gautam Adani: భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీ నేడు తన నికర విలువ 20.1 బిలియన్ డాలర్లు తగ్గడంతో ప్రపంచంలోని టాప్ ఐదు బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయాడు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ గౌతమ్ అదానీ యాజమాన్యంలోని సంస్థలు మార్కెట్ మానిప్యులేషన్ మరియు అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఆరోపణ తర్వాత భారతదేశంలో చట్టపరమైన ఎంపికలను పరిశీలిస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది.
అదానీ గ్రూప్ లీగల్ గ్రూప్ హెడ్ జతిన్ జలంధ్వాలా మాట్లాడుతూ.. "24 జనవరి 2023న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక అదానీ గ్రూప్ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపిందని అన్నారు. దీంతో అదానీ నికర విలువ 16 శాతానికి పైగా పడిపోయింది. శుక్రవారం గౌతమ్ అదానీ నికర విలువ 16.88 శాతం క్షీణించిన తర్వాత మొదటి ఐదు బిలియనీర్ జాబితాలో స్థానం కోల్పోవడమే కాకుండా, అతను USD 100-బిలియన్ క్లబ్‌లో లేడు.
అతని నికర విలువ తగ్గిన తర్వాత, అతను ఒక రోజులో నాల్గవ స్థానం నుండి ఏడవ స్థానానికి పడిపోయాడు. అయితే, అతను భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నాడు. గత రెండేళ్లలో, అదానీ నికర విలువ 2020లో USD 8.9 బిలియన్ల నుండి ఇప్పుడు USD 99.1 బిలియన్లకు పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com