ఆధార్‌కి పాన్ కార్డ్ జత చేయకపోతే, ఆ లింక్ తెగిపోతుంది..! ఇంకా ఏం జరుగుతుందంటే?

ఆధార్‌కి పాన్ కార్డ్ జత చేయకపోతే, ఆ లింక్ తెగిపోతుంది..! ఇంకా ఏం జరుగుతుందంటే?
దాదాపు కొన్ని నెలల నుంచి మొత్తుకుంటోంది ప్రభుత్వం ఆధార్‌తో పాన్ లింక్ చేయమని.. ఇవాళ్టితో ( మార్చి 31,2021)తో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డు కనుక లింక్ చేయకపోతే, రేపటి నుంచి సదరు పాన్ కార్డు చెల్లుబాటు కాదు.

ఇవాళ్టితో ( మార్చి 31,2021)తో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డు కనుక లింక్ చేయకపోతే, రేపటి నుంచి సదరు పాన్ కార్డు చెల్లుబాటు కాదు అంతేకాదు, తర్వాత లింక్ చేసుకుంటే , అంటే ఏప్రిల్ 1,2021 తర్వాత కనుక లింక్ చేసుకుంటే, వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది ఈ రెండూ జరగొచ్చు. లేదంటే ఏ ఒక్కటైనా జరగొచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో కొత్తగా చేర్చిన సెక్షన్ 234H ప్రకారం ఈ చర్యలు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వానికి అధికారం దక్కింది. ఈ నెల 23న ఇందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది

ఎవరైతే నిర్దేశించిన ఆఖరు తేదీ( ప్రస్తుతానికి మార్చి 31,2021) లోపున ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోరో వారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్ 234H వీలు కల్పిస్తుంది. ఈ తేదీ ఇప్పటికే బోలెడుసార్లు వాయిదా వేస్తూ గడువు పెంచుతూ వచ్చారు. రేపట్నుంచే సదరు చట్టం అమల్లోకి రాబోతుంది కాబట్టి ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవడం బెటర్.

గతంలో ఇలా లింక్ చేసుకోనివారిపై జరిమానా విధించడానికి అవకాశం లేదు.కొత్త చట్టంతో ఫైన్ వేస్తారు, ఐతే పాన్ కార్డు పని చేయకపోతే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు కాబట్టి..ఇది ఎవరికి వారు విధిగా చేసుకోవాల్సిన పనే. ఎందుకంటే పాన్ కార్డ్ లేకుండా ఐటీ రిటన్స్ దాఖలు చేయలేరు. అలానే బ్యాంక్ అక్కౌంట్లు తెరవలేరు.

ఓ వేళ తెరిచినా టిడిఎస్ ఎక్కువగా కట్ అవుతుంది.భవిష్యత్తులో ఇలా పాన్ కార్డు జత చేయకుండా లావాదేవీలు నిర్వహించినందుకు ఆదాయపు పన్ను చట్టంలోని 272B సెక్షన్ ప్రకారం పదివేల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు

Tags

Read MoreRead Less
Next Story