పెరగనున్న బిర్యానీ రేటు.. ఇది తాలిబన్ల ఎఫెక్టే మరి..!

పెరగనున్న బిర్యానీ రేటు.. ఇది తాలిబన్ల ఎఫెక్టే మరి..!
హ్మ్.. బిర్యానీ ఈ పేరు వింటే నోరురని వారంటూ ఎవరుంటారు చెప్పండి.. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తినేయడమే..

హ్మ్.. బిర్యానీ ఈ పేరు వింటే నోరురని వారంటూ ఎవరుంటారు చెప్పండి.. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తినేయడమే.. అసలు హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్ మరి.. ఎంతోమంది ప్రముఖులు సైతం హైదరాబాద్ కి వస్తే బిర్యానీ తినకుండా తిరిగి వెళ్ళరు. ఇక నగరవాసులు అయితే తరచూ బిర్యానీ తింటూ ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలా ఎంతోమందిని నోరూరించే హైదరాబాద్ బిర్యానీ మరికొన్ని రోజుల్లో నాన్ వెజ్ ప్రియులకి భారం కాబోతుంది. అంతేకాకుండా టేస్టులోనూ చేంజ్ కనిపించనుంది. ఎందుకు అంటారా? అయితే ఫుల్ మ్యాటర్ లోకి వెళ్ళాల్సిందే.

ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఇటీవల తాలిబన్లు వశం చేసుకున్న సంగతి తెలిసిందే.. మరికొన్ని రోజుల్లో అక్కడ తాలిబన్లు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంతకుముందు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాల మంచి సంబంధాలుండేవి అక్కడి వస్తువులు ఇక్కడికి, ఇక్కడి వస్తువులు అక్కడికి ఎగుమతి, దిగుమతులు అయ్యేవి. అందులో భాగంగానే బిర్యానీలో ఉపయోగించే వంటసామాగ్రీ అధికభాగం అప్ఘానిస్తాన్ నుంచి భారత్ కి దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాలిబన్ల చేతికి ఆఫ్గాన్ దేశం వెళ్ళడంతో అక్కడ అధికార సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి.

ఫలితంగా బిర్యానీ ధరలు పెరగవచ్చని వ్యాపారులు అనుకుంటున్నారు. అంతే కాకుండా డ్రై ఫ్రూట్స్ కొరత ఏర్పడితే బిర్యానీ రుచిలో కూడా మార్పు ఉండొచ్చని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story