Air India: భారీ డీల్‌కు ఎయిరిండియా కసరత్తు.. 200 కొత్త విమానాలు కొనుగోలు..

Air India: భారీ డీల్‌కు ఎయిరిండియా కసరత్తు.. 200 కొత్త విమానాలు కొనుగోలు..
X
Air India: టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియాను మరో ముందడుగు వేసింది. భారీ డీల్‌కు కసరత్తు చేస్తోంది.

Air India: టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియాను మరో ముందడుగు వేసింది. భారీ డీల్‌కు కసరత్తు చేస్తోంది. మరో 200 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. 70 శాతం విమానాలు సన్నని బాడీతో ఉండే ఎయిర్‌బస్‌కు చెందిన A350 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్‌లను మాత్రమే తీసుకునేందుకు ఎయిర్‌బస్, బోయింగ్‌లతో చర్చలు సాగిస్తున్నాయి. 2006లో 111 విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇచ్చింది ఎయిరిండియా.

అయితే ఆ తర్వాత ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. మరోవైపు గతేడాది జనవరి 27న టాటా గ్రూప్ ఎయిరిండియాను చేతిలో తీసుకున్న తర్వాత అక్టోబర్ 8న ఎయిర్‌లైన్‌కు సంబంధించిన బిడ్‌ను విజయవంతంగా ముగించింది ఎయిరిండియా. ఇపుడు త్వరలో జరిగే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ 78వ వార్షిక సమావేశం సందర్భంగా ఎయిరిండియా కొత్తగా 200 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

Tags

Next Story