Airtel 5G: 5జీ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్ కీలక ప్రకటన..

Airtel 5G: 5 జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎయిర్‌టెల్. ఆగష్టు నెలలోనే 5 జీ సేవలను తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికాం గేర్ల తయారీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్,నోకియాతో చాలా రోజుల నుంచి ఒప్పందం కొనసాగిస్తోంది.
ఈ ఏడాది నుంచి శాంసంగ్‌తోనూ ఒప్పందం కొనసాగనుంది. ఇటీవల నిర్వహించిన 5 G స్పెక్ట్రమ్ వేలంలో 900 మెగా హెడ్జ్, 1800 మెగా హెడ్జ్, 21 00, 3300 మెగా హెడ్జ్‌లతో పాటు 26 గిగా హెడ్జ్ బ్యాండ్స్‌లో 19, 867.8 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్‌ను 43 వేల 84 కోట్లకు ఎయిర్ టెల్ కొనుగోలు చేసింది.
మరోవైపు టెలికాం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ నెల 10 కల్లా పూర్తవుతుందని, వచ్చే అక్టోబర్ నుంచి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5జీ సేవలు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు కేంద్రమంత్రి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com